పెళ్లిలో సల్మాన్‌తో కలిసి స్టెప్పులేసిన వెంకీ, రానా

టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్ళి వేడుకులు జైపూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా సీక్రెట్‌గా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సంబంధించి రీసెంట్‌గా మూడు ఫోటోలు బయటకి వచ్చాయి. ఇక సంగీత్‌లో సల్మాన్‌తో కలిసి వెంకటేష్, రానా చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వెంకీ కూతురు వివాహానికి బాలీవుడ్ హీరో ఖాన్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. పెళ్లికి వచ్చిన సల్మాన్.. వేడుకల్లో తను నటించిన ‘కిక్’ సినిమాలోని జుమ్మే కీ రాత్ పాటకు వెంకీ, రానాలతో కలిసి జోష్‌గా స్టెప్పులు వేశాడు.
ఈ వీడియో ఇటు సౌత్, అటు నార్త్ ఇండస్ట్రీలకి సంబంధించిన అభిమానులని అలరిస్తుంది. వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో రాజస్థాన్‌లోని జయపురలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభకార్యానికి వెంకీ బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు.
Mamuluga ne oka level lo entertainment istaru
Ika own daughter marriage lo? pic.twitter.com/fMHKUV5EZd
— Venkatesh Debba BO Abba (@veerutherocker) March 24, 2019