Veena Srivani : భర్తేమో ప్రభాస్ పై కామెంట్స్.. భార్యేమో స్పెషల్ గిఫ్ట్స్ పంపిస్తుంది.. అడిగి మరీ తెప్పించుకుంటున్న ప్రభాస్..

ఇటీవల వీణా శ్రీవాణి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఓ వీడియోని షేర్ చేసింది.

Veena Srivani : భర్తేమో ప్రభాస్ పై కామెంట్స్.. భార్యేమో స్పెషల్ గిఫ్ట్స్ పంపిస్తుంది.. అడిగి మరీ తెప్పించుకుంటున్న ప్రభాస్..

Venu Swamy Wife Veena Srivani Talks about Prabhas Video goes Viral

Veena Srivani : పలువురి సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్తూ వేణుస్వామి(Venu Swami) బాగానే పాపులర్ అయ్యారు. ఇక కొంతమంది సెలబ్రిటీలు ఆయన దగ్గరకు ప్రత్యేక పూజలు చేయించుకోడానికి వెళ్తూ ఉంటారు. దీంతో వేణుస్వామికి కూడా సెలబ్రిటీ హోదా వచ్చేసింది. గతంలో పలుమార్లు ప్రభాస్ గురించి, ప్రభాస్(Prabhas) సినిమాలు ఫెయిల్ అవుతాయని, ప్రభాస్ పెళ్లి గురించి.. రకరకాల కామెంట్స్ చేసి వైరల్ అయ్యాడు వేణుస్వామి.

వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా అందరికి సుపరిచితమే. తన వీణ వాయిద్యంతో ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటుంది. వేణుస్వామి ఎప్పుడు వివాదాల్లో నిలిస్తే వీణా శ్రీవాణి మాత్రం సెలబ్రిటీ స్టేటస్ కి దూరంగానే ఉంటుంది. ఇటీవల వీణా శ్రీవాణి ఓ వీడియోని షేర్ చేసింది.

Also Read : Akhanda 2 : ఎన్నికల తర్వాతే ‘అఖండ 2’ ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి..

ఆ వీడియోలో సీతాఫలాలు చూపిస్తూ.. ఇవి ఎవరికి పంపిస్తున్నానో తెలుసా మన డార్లింగ్ ప్రభాస్ కి. మేము ప్రతి సంవత్సరం మా దగ్గర పండిన సీతాఫలాలు కొంతమందికి ఇస్తాం. అలా ఓ స్పెషల్ వ్యక్తికి పంపిస్తే ఆయన దగ్గర్నుంచి ప్రభాస్ దగ్గరికి వెళ్లాయి. ప్రభాస్ కి మా సీతాఫలాలు నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని అడిగారు. ప్రభాస్ అడిగితే పంపించకుండా ఉంటామా. అందుకే ఈ సీతాఫలాలన్నీ ప్రభాస్ గారికి పంపిస్తున్నాము. దాంతో పాటు ఈ ఆర్గానికి హ్యాండ్ బ్యాగ్ కూడా పంపిస్తున్నాను. మళ్ళీ వచ్చే సీజన్ లో కూడా సీతాఫలాలు ప్రభాస్ గారికి పంపిస్తాను అని తెలిపింది.

తాజాగా ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ పక్క వేణుస్వామి ప్రభాస్ పై కామెంట్స్ చేస్తుంటే, మరో పక్క ఆయన భార్య వీణా శ్రీవాణి ప్రభాస్ అడిగి మరీ సీతాఫలాలు తెప్పించుకుంటున్నాడని ఆయనకు స్పెషల్ గిఫ్ట్స్ పంపిస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని విమర్శిస్తూ వీణా శ్రీవాణిని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడినా అవేమి పట్టించుకోకుండా ప్రభాస్ మిమ్మల్ని ఇలా అడిగాడని అంటున్నారు. ఇక ప్రభాస్ భోజన ప్రియుడు అని తెలిసిందే, అందుకే ఆయనకు సీతాఫలాలు నచ్చడంతో అడిగి మరీ తెప్పించుకుంటున్నారు అని భావిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ పేరు వాడుకొని వేణుస్వామి బాగా పాపులర్ అయితే ప్రభాస్ కి గిఫ్ట్స్ పంపించి వీణా శ్రీవాణి పాపులర్ అవుతుంది.