Akhanda 2 : ఎన్నికల తర్వాతే ‘అఖండ 2’ ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి..

అఖండ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయి భారీ విజయాన్ని ఇచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.

Akhanda 2 : ఎన్నికల తర్వాతే ‘అఖండ 2’ ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి..

Boyapati Sreenu gives Clarity About Balakrishna Akhanda 2 Movie

Updated On : April 16, 2024 / 7:42 AM IST

Akhanda 2 : బోయపాటి(Boyapati Sreenu) – బాలకృష్ణ(Balakrishna) కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు ఒక దానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. అఖండ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయి భారీ విజయాన్ని ఇచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. బాలకృష్ణ ఇప్పుడు NBK109 సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారు. NBK 109 సినిమా షూటింగ్ కి కూడా ఎన్నికలు అయ్యేదాకా గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలక్షన్స్ అయ్యాకే మళ్ళీ బాలయ్య సినిమాలు మొదలుపెట్టనున్నారు. అఖండ 2 సినిమా కూడా ఎన్నికలు అయ్యాకే ఉండబోతుంది. తాజాగా బోయపాటి శీను మీడియాతో మాట్లాడారు. కోకాపేటలో నిర్మాత సురేష్ బాబు నిర్మించిన శివ కేశవ మహా సన్నిధానం ఆలయం ప్రారంభోత్సవం జరగగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read : Varsha Bollamma : మళ్ళీ RCB ఓటమి.. హార్ట్ బ్రేక్ అయింది అంటున్న వర్ష బొల్లమ్మ..

ఈ ఆలయ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. ఎన్నికలు అయ్యాక అఖండ 2 సినిమా అనౌన్స్ ఉంటుంది. అఖండలో పసిబిడ్డ ప్రకృతి పరమాత్మ అనే కాన్సెప్ట్ ని చూపించాం. అఖండ 2లో కూడా సమాజానికి కావాల్సిన మంచి కాన్సెప్ట్ ఉంటుంది అని తెలిపారు. దీంతో బాబీతో చేస్తున్న సినిమా అవ్వగానే బాలయ్య అఖండ 2 మొదలుపెడతారని సమాచారం. ఈ సారి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఇంకే రేంజ్ లో హిట్ కొడతారో చూడాలి.