Vani Jairam Dead : అసలేం జరిగింది? నుదిటిపై గాయం, ప్రముఖ సింగర్ వాణీ జయరాం మృతిపై అనుమానాలు

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. ఆమె మృతిని అనుమానాస్పదంగా భావించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె నుదుటిపైన స్వల్పంగా గాయమైనట్లు పోలీసులు గుర్తించారు.

Vani Jairam Dead : అసలేం జరిగింది? నుదిటిపై గాయం, ప్రముఖ సింగర్ వాణీ జయరాం మృతిపై అనుమానాలు

Updated On : February 5, 2023 / 9:29 PM IST

Vani Jairam Dead : ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. ఆమె మృతిని అనుమానాస్పదంగా భావించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె నుదుటిపైన స్వల్పంగా గాయమైనట్లు పోలీసులు గుర్తించారు.

ఇంట్లో జారి కింద పడటంతో వాణీ జయరాం తల టేబుల్ కి తగిలిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చెన్నైలోని తన ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఇవాళ ఉదయం వాణీ జయరాం ఇంటికి వచ్చిన పనిమనిషి.. ఇల్లు మూసి ఉండటంతో డోర్ బెల్ కొట్టింది. డోర్ బెల్ ఎంత కొట్టినా ఇంట్లో నుంచి స్పందన లేదు.

Also Read..Vani Jairam: సినీ ఇండస్ట్రీలో ఆగని విషాదాలు.. ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత

వెంటనే ఇరుగుపొరుగు వారికి పనిమనిషి సమాచారం ఇచ్చింది. వారు ఈ విషయాన్ని వాణీ జయరాం సోదరికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వాణీ జయరాం ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఉమా దగ్గరున్న అదనపు తాళం చెవితో డోర్ ఓపెన్ చేశారు. లోపల వాణీ జయరాం విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు. పనిమనిషి, స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇంటిని ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్‌లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Also Read..Vani Jairam : అయిదు దశాబ్దాల సంగీత ప్రయాణం.. ‘శంకరాభరణం’ వాణీ జయరాంకు పద్మభూషణ్..

వాణీ జయరాం మృతి అనుమానాస్పదంగానే కనిపిస్తోందన్నారు పోలీసులు. ఆ దిశగా దర్యాఫ్తు చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్ పురి ఇలా 18 భాషల్లో పది వేలకు పైగా పాటలు పాడారు. ఆమె తన చివరి పాటను మలై సినిమాలో ఆలపించారు. ప్రస్తుతానికి వాణీ జయరాం మృతి అనుమానాస్పదంగానే ఉందని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఆమె నుదిటిపై గాయం ఉండటంతో.. ఆమెది సహజ మరణమా? లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అనే అనుమానాలు నెలకొన్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.