Vicky kaushal : ఈ హీరో పిజ్జాలు, బర్గర్లు తింటే బరువు తగ్గుతాడంట.. అమితాబ్ తో సహా అంతా ఆశ్చర్యపోతున్నారు..

బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ సంవత్సరం క్రితం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోపక్క సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. తాజాగా విక్కీ కౌశల్ తన భార్య కత్రినా కైఫ్ తో కలిసి అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు.

Vicky kaushal : ఈ హీరో పిజ్జాలు, బర్గర్లు తింటే బరువు తగ్గుతాడంట.. అమితాబ్ తో సహా అంతా ఆశ్చర్యపోతున్నారు..

if Vicky kaushal eats junk food he decreasing weight

Updated On : June 3, 2023 / 4:46 PM IST

Vicky kaushal :  సాధారణంగా జంక్ ఫుడ్ తింటే ఎవరైనా లావు అవుతారు. లేదా బాడీలో, ఫేస్ లో చేంజ్ అయినా వస్తుంది. ఇక సినిమా సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్ అయితే జంక్ ఫుడ్ కి చాలా దూరంగా ఉంటారు. తమ అందాన్ని, బాడీని కాపాడుకోవడానికి పిజ్జాలు, బర్గర్లు.. లాంటి జంక్ ఫుడ్ అసలు తినరు. అయితే ఈ హీరో మాత్రం అవి తింటేనే బరువు తగ్గుతానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ సంవత్సరం క్రితం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోపక్క సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. తాజాగా విక్కీ కౌశల్ తన భార్య కత్రినా కైఫ్ తో కలిసి అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు.

Anjali : అలాంటి సీన్స్ చేయాల్సొచ్చినప్పుడు కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చాను.. కానీ తప్పదుగా..

ఈ కార్యక్రమంలో విక్కీ కౌశల్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. నాకు ఒక అందమైన సమస్య ఉంది. నేను బరువు పెరగట్లేదు. పైగా పిజ్జాలు, బర్గర్లు తింటుంటే బరువు తగ్గుతున్నాను అని తెలిపాడు. దీంతో అమితాబ్ తో సహా అక్కడ షోలో ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయం బయటకి వచ్చాక జంక్ ఫుడ్ తింటే విక్కీ కౌశల్ బరువు తగ్గుతాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.