విక్కీ కౌశల్‌కు తీవ్ర గాయాలు

విక్కీ కౌశల్ తీవ్ర గాయాలపాలై, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

  • Published By: sekhar ,Published On : April 20, 2019 / 09:46 AM IST
విక్కీ కౌశల్‌కు తీవ్ర గాయాలు

విక్కీ కౌశల్ తీవ్ర గాయాలపాలై, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

ఇటీవలే యూరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ తీవ్ర గాయాలపాలై, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. విక్కీ, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, శశాంక్ కైతాన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన భాను దర్శకత్వంలో ఒక హారర్ ఫిలిం రూపొందుతుంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని యాక్షన్ సీన్స్ గుజరాత్‌లో షూట్ చేస్తుండగా.. విక్కీ కౌశల్ దవడ ఎముక విరిగింది.

వెంటనే స్పందించిన మూవీ యూనిట్ విక్కీని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్ళగా దాదాపు 13 కుట్లు పడ్డాయి. రాత్రిపూట షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. దాని తర్వాత విక్కీ మెరుగైన వైద్యం కోసం బాంబే వెళ్ళాడు. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు విక్కీ కౌశల్‌ను పరామర్శిస్తున్నారు.