చిన్నోడి ఫంక్షన్‌కి పెద్దోడు గెస్ట్
మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం..

మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా మహర్షి, ప్రీ-రిలీజ్ ఈవెంట్, మే 1న (ఈరోజు) సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో జరగనున్న సంగతి తెలిసిందే. మూవీ యూనిట్, సినీ పెద్దలతో పాటు, ఇప్పటివరకు మహేష్‌తో పనిచేసిన దర్శకులందరూ ఈ ఫంక్షన్‌కి రానున్నారని తెలుస్తుంది. రీసెంట్‌గా మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. వెంకీ, మహేష్ కలిసి అన్నదమ్ముళ్ళుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది..
మహేష్ గత సినిమా భరత్ అనే నేనుకి ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. మరి చిన్నోడి ఫంక్షన్‌కి పెద్దోడు గెస్ట్‌గా వస్తున్నాడు కాబట్టి సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్‌గా నటించారు. మహర్షి టీజర్ అండ్ సాంగ్స్‌కి ఆడియన్స్ నుండి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తుంది. మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజవబోతుంది..