Varun Dhawan-Keerthy Suresh : ఆటో ఎక్కిన వరుణ్ ధావన్, కీర్తి సురేష్ వీడియో వైరల్

వరుణ్ ధావన్-కీర్తి సురేష్ ఆటోలో రైడ్‌కి వెళ్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నిజంగానే వీరిద్దరూ రైడ్‌కి వెళ్లారా? షూటింగ్‌లో భాగమా?

Varun Dhawan-Keerthy Suresh

Varun Dhawan-Keerthy Suresh : బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, హీరోయిన్ కీర్తి సురేష్ ఆటో ఎక్కారు. వీరిద్దరు ఆటో రైడ్‌కి వెళ్లిన వీడియో ఇంటర్నెట్‌లో  వైరల్ అవుతోంది. నిజంగానే ఇద్దరు రైడ్‌‌కి వెళ్లారా? లేక షూటింగ్‌లో పార్టా? అని జనాలు చర్చించుకుంటున్నారు.

Viral Video: అచ్చం జవాన్ సినిమాలో షారుక్‌లా ఈ యువకుడు చేసిన పనికి..

వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఓ బాలీవుడ్ మూవీ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వరుణ్‌కి ఇది 18వ సినిమా కాగా, కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే తాజాగా వీరిద్దరూ ఆటో ఎక్కుతూ కనిపించిన వీడియో వైరల్ అయ్యింది.

వరుణ్, కీర్తి నటిస్తున్న కొత్త సినిమాని అట్లీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2024 సమ్మర్‌కి వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని అంచనా. జవాన్ సూపర్ హిట్‌తో మాంచి ఊపులో ఉన్న అట్లీ వరుణ్ ధావన్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వరుణ్, కీర్తిలపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి కావచ్చని తెలుస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం వరుణ్, కీర్తిలపై కొన్ని ఎమోషనల్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఈ సినిమా తమిళ సినిమా థెరి (Theri) రీమేక్ అని అంటున్నారు.

Siri Hanumanthu : జవాన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఫేక్ కాల్ అనుకున్నా.. అట్లీ బాగా తిట్టడంతో ఏడ్చేశా..

ఇక వరుణ్, కీర్తి ఆటోలో రైడ్ చేస్తున్న వీడియో షూటింగ్‌లో పార్ట్‌గా అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది.