Manchu Lakshmi : మూడు తరాల మంచు మగువలు.. జడలు వేసుకుంటూ సరదా వీడియో పోస్టు చేసిన మంచు లక్ష్మి
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా మంచు లక్ష్మి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముంది?

Manchu Lakshmi
Manchu Lakshmi : మంచువారమ్మాయి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రీల్‌లో నటనతోనే కాదు రియల్ లైఫ్‌లో సామాజిక సేవ చేస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్నారు. రీసెంట్‌గా మంచు లక్ష్మి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?
Jersey : జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట.. ఆయన కోసం రాసిన కథని నాని..
యాంకర్‌గా, నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మి. మంచు కుటుంబం ఇప్పటికే తమ విద్యా సంస్థల ద్వారా ఎంతోమందికి ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు. అయితే మంచు వారసురాలు ఒక అడుగు ముందుకు వేసి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్ధాపించారు. ఈ సంస్థ ద్వారా కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటిని డిజిటలైజ్ చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దీపావళి సందర్భంలో ఆ పాఠశాలల విద్యార్ధులతో పండుగ సంబరాలు చేసుకున్నారు మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి తన తల్లి, కూతుళ్లతో కలిసి తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసారు. అది నెట్టింట వైరల్ అవుతోంది.
మంచు లక్ష్మి, తల్లి నిర్మలా దేవి, కూతురు విద్యా నిర్వాణ జడలు వేసుకుంటున్న వీడియోని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అమ్మా’ అనే ట్యాగ్‌తో మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. మూడు తరాల అమ్మలను ఇలా చూడటం సంతోషంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మంచు లక్ష్మి ప్రస్తుతం తండ్రి మోహన్ బాబుతో కలిసి ‘అగ్ని నక్షత్రం’ అనే మూవీ చేస్తున్నారు. సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మళయాళ నటుడు సిద్ధిక్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram