Nayanthara : నయనతార అమ్మకు విగ్నేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. పిక్స్ చూశారా..?

నయనతార తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విగ్నేష్ శివన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Nayanthara : నయనతార అమ్మకు విగ్నేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. పిక్స్ చూశారా..?

Vignesh Shivan birthday wishes to Nayanthara mother

Updated On : September 15, 2023 / 10:42 AM IST

Nayanthara : కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ (Vignesh Shivan).. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటారు. తమ లైVignesh Shivan birthday wishes to Nayanthara motherఫ్ కి సంబంధించిన ఏదో ఒక విషయం నెట్టింట పోస్ట్ చేస్తూ లైం లైన్ లో ఉంటుంటారు. తాజాగా నయనతార తల్లి పుట్టినరోజు కావడంతో విగ్నేష్ శివన్.. తన అత్తమ్మకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Suriya 43 : సూర్య, సుధా కొంగర సినిమాలో నజ్రియా నజీమ్..?

“హ్యాపీ బర్త్ డే అత్తమ్మ. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. మీరే నా అతిపెద్ద బలం. మీ ప్రార్ధనలు, దీవెనలు మా జీవితాన్ని అందంగా చేస్తున్నాయి. నా నుంచి మరియు నయన్, ఉయర్, ఉలగం నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ప్రేమతో ఒక నోట్ రాసుకొచ్చాడు. అలాగే నయనతార తన తల్లితో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఒకసారి మీరుకూడా ఆ ఫోటోలు చూసేయండి.

Baby Movie : బేబీ సినిమాపై సీపీ ఆగ్రహం.. స్పదించిన దర్శకుడు సాయి రాజేష్..

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

ఇక నయనతార సినిమాలు విషయానికి వస్తే.. ఇటీవల షారుఖ్ ఖాన్ జవాన్ (Jawan) సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. 600 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని ముందుకు దూసుకుపోతుంది. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కాగా నయనతారకి ఇదే మొదటి హిందీ మూవీ. ఫస్ట్ మూవీతోనే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెడుతుందా..? లేదా? అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక విగ్నేష్ శివన్ సంగతికి వస్తే.. ఇటీవల అజిత్ తో సినిమా అనౌన్స్ చేసినప్పటికీ అది ఎందుకో పట్టాలు ఎక్కలేదు.