Vignesh Shivan : LIC దెబ్బకి సినిమా టైటిల్ మార్చేసిన నయనతార భర్త..

విగ్నేష్ శివన్ కొన్ని రోజుల క్రితం లవ్ టుడే సినిమాతో హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. అయితే ఆ సినిమాకి LIC (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే పేరు పెట్టాడు.

Vignesh Shivan : LIC దెబ్బకి సినిమా టైటిల్ మార్చేసిన నయనతార భర్త..

Vignesh Shivan Changed His Movie Title due to Issue with LIC

Updated On : July 25, 2024 / 7:20 AM IST

Vignesh Shivan : నయనతార భర్త విగ్నేష్ శివన్ చేసిన తక్కువ సినిమాలతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. చివరిసారిగా 2022లో విజయ్ సేతుపతితో కాదువాకుల రెండు కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విగ్నేష్ శివన్ కొన్ని రోజుల క్రితం లవ్ టుడే సినిమాతో హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. అయితే ఆ సినిమాకి LIC (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే పేరు పెట్టాడు.

LIC అనే టైటిల్ తోనే సినిమాని ప్రమోట్ చేసాడు. దీంతో LIC వాళ్ళు ఈ సినిమా టైటిల్ పై విమర్శలు చేసారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ని ఇలా ఇష్టమొచ్చినట్టు పేరు మార్చి, ప్రభుత్వ సంస్థని డ్యామేజీ చేస్తున్నారని విమర్శలు చేసారు. టైటిల్ మార్చాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా వ్యాఖ్యలు చేశారు.

Also Read : Prabhas : ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? స్కూల్ ఏజ్ లోనే..

అయితే విగ్నేష్ శివన్ మొదట్లో దీనిపై స్పందించకపోయినా ఇప్పుడు టైటిల్ మార్చి కొత్త టైటిల్ ని ప్రకటించాడు. తాజాగా విగ్నేష్ శివన్ – ప్రదీప్ రంగనాథన్ సినిమాకు LIK అనే టైటిల్ ప్రకటించారు. LIK అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తూ కొత్త టైటిల్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేసారు. మొత్తానికి వివాదం జరిగినప్పుడు సైలెంట్ గా ఉన్నా ఆ తర్వాత టైటిల్ మార్చి ఇప్పుడు కొత్త టైటిల్ ప్రకటించాడు విగ్నేష్ శివన్. ఇక ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial)