Vijay Antony: బిచ్చగాడు కాంబోలో మరో మూవీ.. ఈసారి ఇంకా సరికొత్తగా.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

బిచ్చగాడు.. 2016లో వచ్చిన ఈ మూవీ క్రియేట్ చేసిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన(Vijay Antony) పనిలేదు.

Vijay Antony: బిచ్చగాడు కాంబోలో మరో మూవీ.. ఈసారి ఇంకా సరికొత్తగా.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Vijay Antony's new movie with Bechgadu director Shashi is Nuru Sami

Updated On : September 11, 2025 / 3:36 PM IST

Vijay Antony: బిచ్చగాడు.. 2016లో వచ్చిన ఈ మూవీ క్రియేట్ చేసిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లి ప్రాణం కోసం బిచ్చగాడిగా మారిన ఒక కోటీశ్వరుడి కథతో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా మూవీ ఆడియన్స్ ను వివరీతంగా ఆకట్టుకుంది. విజయ్ ఆంటోనీ హీరోగా, దర్శకుడు శశి తెరకెక్కించిన ఈ తమిళ మూవీ తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ, ఈ సినిమా టీవీల్లో వచ్చినా మిస్(Vijay Antony) అవకుండా చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Samantha: నా ఆత్మగౌరవాన్ని బాక్సాఫీస్ నంబర్ల దగ్గర పడేశాను.. సమంత సంచలన కామెంట్స్

అయితే, ఈ సినిమా విడుదలై పదేళ్లు గడుస్తున్న నేపధ్యలో హీరో విజయ్ అంటోనో ఆడియన్స్ కి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, బిచ్చగాడు సినిమా దర్శకుడు శశితో మరి సినిమాను అనౌన్స్ చేశారు. “నూరు సామి” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు. ఈ సినిమా కూడా బిచ్చగాడు సినిమాలాగానే చాలా ఎమోషనల్ అండ్ స్ట్రాంగ్ కంటెంట్ తో రానుందట. అయితే, ఈ “నూరు సామి” అనే సినిమా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా రానుంది అనే మరో వాదన కూడా వినిపిస్తుంది. కానీ, మేకర్స్ మాత్రం ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

నిజానికి, బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా 2023లో విజయ్ ఆంటీని బిచ్చగాడు 2 సినిమాను చేశాడు. ఈ సినిమాను కూడా స్వయంగా విజయ్ ఆంటోనీనే డైరెక్ట్ చేయడం విశేషం. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాను బిచ్చగాడు సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. మరి చాలా గ్యాప్ తరువాత తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు శశితో విజయ్ ఆంటోనీ చేస్తున్న చేస్తున్న ఈ ‘నూరు సామీ’ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.