Vijay : రాజకీయ ఎంట్రీపై విజయ్ వ్యాఖ్యలు.. తమిళనాడు రాజకీయాల్లో చర్చ..
రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అన్న ప్రశ్నకి విజయ్ మాట్లాడుతూ.. ''రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాను. హీరోగా ఉన్న నేను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో.......

Vijay
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘బీస్ట్’. ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదల కానుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ ఈ సారి ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు నెల్సన్ తో విజయ్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో బీస్ట్ డైరెక్టర్ అడిగిన పలు సినిమా, రాజకీయ ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు విజయ్. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండగా ఇందులో విజయ్ చెప్పిన పలు సమాధానాలు వైరల్ అవుతున్నాయి.
విజయ్ ఎప్పట్నుంచో రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నారు. అది డైరెక్ట్ గా చెప్పకపోయినా తాను చేసే పనులు చూస్తే అర్ధమవుతుంది. విజయ్ తండ్రి ఆల్రెడీ పార్టీ పెట్టడం తర్వాత దాన్ని రద్దు చేయడం, అయినా ఆఫీస్ అలాగే ఉంచి కార్యకలాపాలు జరపడం, ఇటీవల విజయ్ పేరు, విజయ్ పార్టీ పేరుతో అభిమానులు లోకల్ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవడం, గెలిచిన వారిని విజయ్ ఇంటికి పిలిచి అభినందించడం, విజయ్ ప్రముఖ ఎలక్షన్స్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని కలవడం లాంటివి జరిగాయి. ఇవన్నీ చూస్తే విజయ్ ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎంట్రీ ఇస్తారనే తమిళనాడులో అంతా భావిస్తున్నారు.
Thalapathy 66 : పూజాహెగ్డే కాదంటే రష్మికకి ఈ ఛాన్స్ వచ్చిందట
తాజాగా ఈ ఇంటర్వ్యూలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్ మీద వెళ్లి ఎందుకు ఓట్ వేశారు అని అడగగా అది యాధృచ్ఛికంగా జరిగిందని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. ఇక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అన్న ప్రశ్నకి విజయ్ మాట్లాడుతూ.. ”రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాను. హీరోగా ఉన్న నేను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉంది, అది అభిమానులే నిర్ణయిస్తారు” అని తెలిపారు. దీంతో విజయ్ రాజకీయాల్లోకి రాను అని మాత్రం చెప్పలేదు, అభిమానులు అడిగితే వస్తారనే చెప్పారు, విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ తర్వాత విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.