Vijay Devarakonda About NTR: తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే మెంటలే.. అంటోన్న లైగర్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ మరెవరూ చేయలేరని..అందుకే ఆయన పేరు ఆస్కార్ అవార్డుల కోసం వినిపిస్తుందని విజయ్ అన్నాడు.

Vijay Devarakonda About NTR For Oscar

Vijay Devarakonda About NTR For Oscar: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ అంచనాలను అమాంతం పెంచేశాయి లైగర్ చిత్ర ట్రైలర్ అండ్ సాంగ్స్. కాగా ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు లైగర్ టీమ్ భారీగా ప్రమోషన్స్ చేస్తోంది.

Vijay Devarakonda : పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద విజయ్ దేవరకొండ, అనన్య పాండే

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న లైగర్ టీమ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ లైగర్ చిత్రానికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ మరెవరూ చేయలేరని.. అందుకే ఆయన పేరు ఆస్కార్ అవార్డుల కోసం వినిపిస్తుందని విజయ్ అన్నాడు.

NTR In Oscar Race: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..? వెరైటీ మ్యాగజైన్ ప్రెడిక్షన్స్..

నిజంగా తారక్ అన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తే మెంటల్ ఉంటది అని విజయ్ దేవరకొండ చేసిన కామెంట్‌ను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ్‌ల పర్ఫార్మెన్స్ సూపర్బ్ అని.. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విధానం అత్యద్భుతం అని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా తెలిపాడు. ఏదేమైనా గతకొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డుల బరిలో తారక్ పేరు వినిపిస్తుండటం.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇదే కామెంట్‌ను రిపీట్ చేయడంతో తారక్ అభిమానులు మరింత జోష్‌తో ఊగిపోతున్నారు.