NTR In Oscar Race: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..? వెరైటీ మ్యాగజైన్ ప్రెడిక్షన్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో ఎన్టీఆర్ పేరు నామినేట్ అయ్యింది. అయితే ఇది అఫీషియల్‌గా కాదులెండీ.

NTR In Oscar Race: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..? వెరైటీ మ్యాగజైన్ ప్రెడిక్షన్స్..

NTR In Oscar Race News Goes Viral

NTR In Oscar Race: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్ గురించి కేవలం ఇండియన్ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.

NTR : భార్యతో కలిసి కాఫీ తాగుతూ.. ఫారిన్ లో ఎన్టీఆర్..

దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో ఎన్టీఆర్ పేరు నామినేట్ అయ్యింది. అయితే ఇది అఫీషియల్‌గా కాదులెండీ. ప్రతియేటా ఉత్తమ నటీనటుల జాబితాను ముందే ప్రెడిక్ట్ చేసే వెరైటీ ఎడిషన్ అనే మ్యాగెజిన్ వారు, 2023కు గాను బెస్ట్ యాక్టర్ అనే విభాగంలో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరును ఎంపిక చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు. ఈ ప్రెడిక్షన్ వచ్చే యేడు ఖచ్చితంగా నిజం అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RRR: తారక్ పర్ఫామెన్స్ పీక్స్.. కొమురం భీముడో వీడియో సాంగ్ రిలీజ్

ఏదేమైనా ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా నిలుస్తుందనే వార్త అప్పుడే బలంగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో తారక్ విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌కు యావత్ ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. కొమురం భీం పాత్రలో ఆయన పలికించిన హావభావాలు సూపర్బ్‌గా ఉన్నాయంటూ వారు కితాబిచ్చారు. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయి తన సత్తా చాటాడు.

ntr in oscar

ntr in oscar