Vijay Devarakonda : నేను ఆ రెండింటితో సరసాలు ఆడుతుంటాను.. విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా రిసల్ట్ తో డీలా పడిపోయాడు. విజయ్ దేవరకొండ ఇటీవల ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో విజయ్ ని.. 'మనీ అండ్ సక్సెస్'తో మీ రిలేషన్ ఏంటని ప్రశ్నించగా, విజయ్ దేవరకొండ బదులిస్తూ..

Vijay Devarakonda comments on success and money
Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా రిసల్ట్ తో డీలా పడిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని నమోదు చేయడమే కాకుండా, విజయ్ పాన్ ఇండియా ఎంట్రీని కూడా భారీగా ప్లాప్ చేసింది. దీంతో ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో అయోమయం నెలకుంది. ఈ క్రమంలోనే పూరీజగన్నాధ్ తో మొదలుపెట్టిన పాన్ ఇండియా మూవీ ‘జనగణమన’ పట్టాలు ఎక్కకుండానే గాడి తప్పింది.
Vijay Devarakonda: నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ..?
ఇక విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ ఇటీవల ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో విజయ్ ని.. ‘మనీ అండ్ సక్సెస్’తో మీ రిలేషన్ ఏంటని ప్రశ్నించగా, విజయ్ దేవరకొండ బదులిస్తూ.. “నేను ఆ రెండింటితో సరసాలు ఆడుతుంటాను. ఆ రెండింటికి నేను అట్ట్రాక్ట్ అవుతాను. కానీ నేను నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రిస్క్ అనేది ఎక్కువుగా ఉంటుంది.
పెద్ద పెద్ద కలల మరియు ఆశలు వైపు పరిగెత్తడం వల్ల ‘మనీ అండ్ సక్సెస్’ మనతో దాగుడుమూతలు ఆడుతుంటుంది. ఆ క్రమంలోనే ఆ రెండు మన దగ్గరికి వస్తుంటాయి, పోతుంటాయి. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యా. అలాని నేను ఇక పై కలలు కనడం మానడం అనేది జరగదు” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విజయ్ చేతిలో.. ‘ఖుషి’ సినిమా ఒకటి ఉండగా, గౌతమ్ తిన్ననూరితో మరొక మూవీ లైన్ లో ఉంది.