Vijay Devarakonda: నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ..?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మిగతా షూటింగ్ ఎప్పుడెప్పుడు జరుపుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.

Vijay Devarakonda To Start Next Movie
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మిగతా షూటింగ్ ఎప్పుడెప్పుడు జరుపుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.
Vijay Devarakonda : ఈడీ విచారణపై విజయ్ దేవరకొండ వివరణ
కాగా, ఆమె తిరిగి ఈ సినిమా షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటుందనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో, హీరో విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడట. ఈ క్రమంలో జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తొలుత స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాలని భావించాడు.
Vijay Devarakonda: ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ.. లైగర్ లావాదేవీలపై ఆరా
కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట. ఖుషి మూవీ ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కుతుందో లేదో అనే సందేహం నెలకొనడంతోనే విజయ్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.