Vijay Devarakonda : వందమందికి చెక్కులిచ్చి ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ.. ఒకప్పుడు తమ్ముడి ఫీజు కట్టడానికి ఇబ్బంది పడ్డాం..
తాజాగా నేడు తనకి వచ్చిన ఫామ్స్ లో నుంచి 100 మంది లక్కీ ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కు అందించాడు విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda gives cheques to 100 families each one lakh rupees emotional in event
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, సమంత(Samantha) నటించిన ఖుషి(Kushi) సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవల చిత్రయూనిట్ వైజాగ్(Vizag) లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ.. సినిమా సక్సెస్ అయిన ఖుషిని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తాను. వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తాను. నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటాను అని తెలిపాడు. ఆన్లైన్ లో స్ప్రెడింగ్ ఖుషి అని ఒక ఫామ్ ఇచ్చి ఫిలిప్ చేసి పంపమన్నాడు విజయ్. దాంట్లోంచి లక్కీ 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేస్తానని తెలిపాడు.
తాజాగా నేడు తనకి వచ్చిన ఫామ్స్ లో నుంచి 100 మంది లక్కీ ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కు అందించాడు విజయ్ దేవరకొండ. నేడు ఈవెంట్ లో చెక్స్ అందుకుంటున్న ఫ్యామిలీస్ ఉద్వేగానికి లోనై విజయ్ ను హగ్ చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 100 కుటుంబాలకు విజయ్ దేవరకొండ దగ్గరుండి మరీ చెక్స్ అందించాడు.
అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నాకు ఇంత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్న వాడినే. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా వెకేషన్ వెళ్తే నేను డబ్బులు ఇంట్లో అడగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆగిపోయేవాడిని. అప్పుడు మా ఫ్రెండ్స్ టూర్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచించేవాడిని. మా తమ్ముడి ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బందిపడుతున్నప్పుడు అలాంటి అవసరంలో ఎవరైనా కొంత డబ్బు ఇస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఒక ఫ్యామిలీగా ఈ స్థాయికి చేరుకున్నా. ఇవాళ మీకు ఈ హెల్ప్ చేయగలుగుతున్నా అంటే అది నా పర్సనల్ కోరిక. ఈ లక్ష రూపాయలు అందిన తర్వాత కొంచెం సంతోషం కలిగి, కొంచెం ఒత్తిడి తగ్గి, బలాన్నిచ్చి మీకు ఆనందంగా అనిపిస్తే నాకు అదే సంతృప్తినిస్తుంది. ఈ చిన్న సాయం మీకు ఉపయోగపడితే నాకు హ్యాపీ. నాకు థ్యాంక్స్ చెప్పకండి. మీతో నా ప్రేమను షేర్ చేసుకుంటున్నా అంతే. లాస్ట్ టైమ్ కొంతమంది పిల్లల్ని టూర్ కు పంపించా. ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పటి నుంచి 50 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే 100 మందికి మాత్రమే చేయగలుగుతున్నాం. ప్రతి ఇయర్ ఇంకొందరికి హెల్ప్ చేస్తా. ఇలా నేను స్ట్రాంగ్ గా ఉన్నంతవరకు, నేను సినిమాలు చేస్తున్నంతకాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు విజయ్ దేవరకొండ.
ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఇంతమందికి సహాయం చేసినందుకు విజయ్ ని అభిమానులతో పాటు నెటిజన్లు అభినందిస్తున్నారు.