‘ఫోర్బ్స్ ఇండియా 30’ జాబితాలో విజయ దేవరకొండ
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండకు ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండకు ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండకు ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కింది. 2019 ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’లో 29ఏళ్ల విజయ్ చోటు దక్కించుకున్నాడు. భారత్‌లో 30 ఏళ్ల వయస్సు కన్నా తక్కువ వయసు ఉండి, తమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చినవారి జాబితాను ఫోర్బ్స్ ఆరో ఎడిషన్ సోమవారం విడుదల చేసింది.
ఈ జాబితాలో ఎంటర్ టైన్ మెంట్, మ్యూజిక్ విభాగంలో విజయ్ చోటు దక్కించుకున్నాడు. ఇదే జాబితాలో విజయ్ దేవరకొండతో పాటు ప్రజాత్ కోలి (యూట్యూబర్), మేఘన మిశ్రా (సింగర్) చోటు దక్కించుకున్నారు. మరోవైపు క్రీడారంగంలో ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది.
2011 ఏడాదిలో ‘నువ్విలా’ సినిమాతో విజయ్ దేవరకొండ నటుడిగా మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమాలో హీరోగా నటించి మంచి హిట్ అందుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సెన్సేషనల్ హిట్ రావడంతో విజయ్ క్రేజ్ పెరిగిపోయింది. టాలీవుడ్ యువ హీరోలకే విజయ్ .. గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. బాలీవుడ్ మూవీ ఇండ్రస్టీ వరకు అర్జున్ రెడ్డిగా విజయ్ పేరు మారుమోగిపోయింది.
2018లో విడుదలైన ‘మహానటి’, ‘గీత గోవిందం’ సినిమాలతో విజయ్ మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ లో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.