Kushi OTT : ఖుషి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా..?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన సినిమా ఖుషి (Kushi). ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్సైనట్లు సమాచారం.

Kushi OTT Partner Fix
Kushi OTT Partner : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన సినిమా ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్ లు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ ఈ సినిమాని నిర్మించగా అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నేడు(శుక్రవారం సెప్టెంబర్ 1)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Pawan Kalyan : పవన్ బర్త్ డేకి రెడీ అవుతున్న గిఫ్ట్స్.. ఏ సినిమా నుంచి ఏ అప్డేట్..?
విజయ్ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడినట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫికైనట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. అయితే.. స్ట్రీమింగ్ డేట్ పై అయితే క్లారిటీ రాలేదు గానీ.. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ సినిమా రైట్స్ దక్కించుకున్న తరువాత చిత్రం విడుదలైన నెల తరువాత స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. అదే గనుక జరిగితే ఖుషి సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Shah Rukh Khan : గుండుతో మళ్లీ నటించనన్న షారూఖ్ కామెంట్స్ వైరల్
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. ఒక్క హిట్టు కోసం నాతో పాటు మీరంతా ఐదు సంవత్సరాలుగా ఎదురుచూశారని, దీనికి నేడు ప్రతి ఫలం దక్కిందన్నారు. వందల కొద్ది ఫోన్లు, మెసెజ్‌లతో ఈ ఉదయం నిద్ర లేచినట్లు చెప్పాడు. అందరి అభిమానం చూస్తుంటే తనకు కన్నీళ్లు ఆగడం లేదన్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అందరూ మూవీకి వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.