Vijay Devarakonda: ఆ యంగ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పేసిన విజయ్ దేవరకొండ..?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌కు విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Vijay Devarakonda Okays Movie With Gowtham Tinnanuri
Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా చిత్ర యూనిట్‌కు నిరాశ మిగిల్చింది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో ‘జనగనమణ’ అనే సినిమాను స్టార్ట్ చేశాడు విజయ్.
అయితే ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌కు విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ‘జెర్సీ’ మూవీతో తనలోని ట్యాలెంట్‌ను నిరూపించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, తన నెక్ట్స్ చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో తెరకెక్కించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు వినిపించాడట. అయితే చరణ్ ఈ కథలో కొన్ని మార్పులు కోరినా, ఫైనల్‌గా గౌతమ్‌కు నో చెప్పాడట. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ తన కథను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు వినిపించాడట.
Vijay Devarakonda : దాని గురించి ఇక్కడెందుకు.. వేడుకల్ని ఎంజాయ్ చేయండి..
కథ నచ్చడంతో విజయ్, ఈ డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాను త్వరలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి నిజంగానే జెర్సీ డైరెక్టర్‌కు లైగర్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.