బాలీవుడ్ భామతో విజయ్ దేవరకొండ!

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 01:07 PM IST
బాలీవుడ్ భామతో విజయ్ దేవరకొండ!

Updated On : March 30, 2019 / 1:07 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ముంబైలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసాడు. ఈ ప్రోగ్రామ్‌కు షారుఖ్ దంపతులతో పాటు అక్షయ్, రణ్‌వీర్ సింగ్,కరీనా కపూర్, కత్రినా,కియారా అద్వానీతో పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా అర్జున్ రెడ్డీ మూవీ హిందీ రీమేక్‌లో ప్రీతి పాత్రను పోషిస్తున్న కియారా అద్వానీ ఇటీవల విజయ్ దేవరకొండను కలుసుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగులో ‘భరత్ అను నేను’సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కియార అద్వానీ.. ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ మేరకు నెటిజన్స్ అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ప్రీతి అని కామెంట్స్ పెడుతున్నారు. తెలుగులో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో షాలినీ పాండే.. ప్రీతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే కదా. 

* హిందీ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్ :
ఇటీవలే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం జూన్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. హిందీలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.