Kushi : ఓటీటీలోకి వచ్చేస్తున్న ఖుషి.. ఎప్పుడు? ఎక్కడ?

ఇటీవల ఏ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజయిన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖుషి సినిమా కూడా ఓటీటీ బాట పట్టనుంది.

Kushi : ఓటీటీలోకి వచ్చేస్తున్న ఖుషి.. ఎప్పుడు? ఎక్కడ?

Vijay Devarakonda Samantha Kushi Movie OTT Streaming date Details Here

Updated On : September 24, 2023 / 10:55 AM IST

Kushi Movie :  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం అనుకున్నంత కలెక్షన్స్ రాలేదని సమాచారం. సినిమా రిలీజ్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ చేశాడు.

ఇక ఇటీవల ఏ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజయిన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖుషి సినిమా కూడా ఓటీటీ బాట పట్టనుంది. ఖుషి సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది ఖుషి సినిమా.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు ‘కన్నప్ప’ అప్డేట్.. 800 మంది.. 8 భారీ కంటెయినర్స్‌.. న్యూజిలాండ్ కి తరలింపు..

దీంతో విజయ్, సమంత అభిమానులు సినిమాని మరోసారి ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్స్ లో సినిమా మిస్ అయిన వాళ్ళు ఖుషి ఓటీటీ రాక కోసం చూస్తున్నారు. మరి ఖుషి సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.