Vijay Devarakonda : 100 ఫ్యామిలిలు సెలెక్ట్ చేస్తా.. ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయలు ఇస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్..

విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడిన అనంతరం సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపాడు.

Vijay Devarakonda : 100 ఫ్యామిలిలు సెలెక్ట్ చేస్తా.. ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయలు ఇస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్..

Vijay Devarakonda says he will give one lakh rupees to 100 lucky families in Kushi Movie Success Celebrations

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి(Kushi) సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజయి మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ వైజాగ్(Vizag) లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా విజయ్ దేవరకొండ, చిత్రయూనిట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా వచ్చారు.

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడిన అనంతరం సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపాడు.

Shahrukh Khan : మొదటిసారి తిరుమలకు షారుఖ్ ఖాన్.. కూతురు సుహానా, నయనతారతో కలిసి.. జవాన్ ప్రమోషన్స్..

దీని గురించి విజయ్ మాట్లాడుతూ.. ఇవాళ సినిమాకు మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది. నేను డబ్బు సంపాదించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి అని మాత్రమే ఆలోచించేవాడిని. ఇవాళ ఖుషికి మీరిస్తున్న ఆదరణ చూస్తుంటే నేనొక మంచి సినిమా చేస్తే చూసేందుకు మీరంతా ఎదురుచూస్తున్నారని అర్థమైంది. నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు. నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి ఖుషిని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మీ నవ్వులు చూద్దామని అనుకున్నా చూస్తున్నా. కానీ తృప్తి లేదు. ఏదో చేయాలని ఉంది. పర్సనల్ గా మీ అందరినీ కలవలేను. అందుకే నా ఖుషి మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తాను. నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరంతా దేవర ఫ్యామిలీ. నా సోషల్ మీడియాలో ఒక ఫామ్ పెడతాను స్ప్రెడింగ్ ఖుషి అని. దాన్ని ఫీల్ చేసి పంపిస్తే నేను లక్కీ 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేస్తాను. నేనిచ్చే మనీ మీకు రెంట్స్, ఫీజు దేనికి హెల్ప్ అయినా నాకు సంతోషం అని అన్నారు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.