దేవరకొండ.. థియేటర్‌లో టికెట్స్ అమ్మాడు!

‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ సందర్భంగా విజయ్‌ దేవరకొండ ప్రసాద్ ఐమ్యాక్స్‌ థియేటర్‌లోని కౌంటర్‌లో కూర్చుని టికెట్లు అ‍మ్మాడం విశేషం..

  • Published By: sekhar ,Published On : November 1, 2019 / 07:21 AM IST
దేవరకొండ.. థియేటర్‌లో టికెట్స్ అమ్మాడు!

Updated On : November 1, 2019 / 7:21 AM IST

‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ సందర్భంగా విజయ్‌ దేవరకొండ ప్రసాద్ ఐమ్యాక్స్‌ థియేటర్‌లోని కౌంటర్‌లో కూర్చుని టికెట్లు అ‍మ్మాడం విశేషం..

టాలీవుడ్‌లో క్రేజీయెస్ట్ యంగ్ హీరో, నిర్మాతగా మారి తన ఫస్ట్ సినిమా రిలీజ్ రోజు టికెట్ కౌంటర్‌లో కూర్చుని ఆడియన్స్‌కు టికెట్స్ అమ్మితే ఎలా ఉంటుంది? క్రీజీ ఐడియా కదూ!.. విజయ్ దేవరకొండ అంతే.. తను ఏం చేసినా డిఫరెంట్‌గా చేస్తుంటాడు.. 

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘ఏ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై, ‘పెళ్లిచూపులు’ మూవీతో తనకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ని హీరోగా, షమ్మీర్ సుల్తాన్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా రూపొందించాడు.. నవంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సందర్భంగా విజయ్‌ ప్రసాద్ ఐమ్యాక్స్‌ థియేటర్‌లోని కౌంటర్‌లో కూర్చుని టికెట్లు అ‍మ్మడం విశేషం..

Read Also : ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ‘ఒడయ’ టీజర్

విజయ్‌ టికెట్లు అమ్ముతున‍్న విషయం తెలుసుకున్న ప్రేక్షకులు థియేటర్‌ దగ్గర గుమిగూడారు. తమ అభిమాన హీరో చేతుల మీదుగా టికెట్లు తీసుకునేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. రౌడీ అమ్మిన టికెట్లు సొంతం చేసుకున్న ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలయ్యారు.. విజయ్‌ దేవరకొండ మొట్టమొదటిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇందులో తరుణ్‌ భాస్కర్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాసేపు నవ్వుకోడానికైనా ఈ సినిమాను చూడొచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు..