Middle Class Fund : విజయ్ దేవర కొండ ఫౌండేషన్..రిపోర్ట్

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 07:47 AM IST
Middle Class Fund : విజయ్ దేవర కొండ ఫౌండేషన్..రిపోర్ట్

Updated On : June 3, 2020 / 7:47 AM IST

విజయ్ దేవరకొండ ఫౌండేషన్ కూడా విజయ్ లానే అగ్రెసివ్ గా దూసుకుపోతోంది. ఏదో ఓ రెండు వేల మందికి సాయం చేద్దామనుకున్న విజయ్ ఇఫ్పుడు వేల కుటుంబాలకు సహాయం చేసేంత ఫండ్స్ రెయిజ్ చేశారు. ప్రతి వారం తన ఫౌండేషన్ డీటేల్స్ ను ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ.. విమర్శలకు టైమ్ ఇవ్వడం లేదు విజయ్.  సాయ చేయడంతో తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ఫండ్ ఎలా వర్క్ చేసిందో .. డీటెయిల్స్ అన్నీ ట్రాన్సపరెంట్ గా సోషల్ మీడియాలో పెట్టేశారు రౌడీ హీరో.  

విజయ్ దేవరకొండ డిఫరెంట్ : – 
విజయ్ దేవరకొండ  ఏం చేసినా డిఫరెంట్ గానే చేస్తారు. అది ప్రొఫెషనల్ గా అయినా, పర్సనల్ గా అయినా.. ప్రతీ పనిలో తన మార్క్ వేరియేషన్ ని చూపిస్తాడు ఈ రౌడీ హీరో. ఈ మద్య ఫౌండేషన్, మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ.. నా రూట్ సెపరేట్ అనిపించుకున్నారు విజయ్.

పెరుగుతున్న అప్లికేషన్లు : – 
పాతిక లక్షల మొత్తంతో  2500 కుటుంబాలకు సహాయపడాలని తపనతో విజయ్ ఈ మిడిల్ క్లాస్ ఫండ్‌ను ప్రారంభించారు. అయితే.. దేవరకొండ ఫౌండేషన్ కు మొదట్లో 50 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయి. దాంతో ఏకంగా 7500 కుటుంబాలకు సహాయపడ్డారు. కాని అప్పటి నుంచి వరుసగా అప్లికేషన్స్ పెరుగుతూ వస్తూనే ఉన్నాయి.

ఆన్ లైన్ లో రిపోర్టు : – 
ఎప్పటికప్పుడు తన ఫౌండేషన్ వివరాలు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు విజయ్. ఎంత మందికి సాయం అందింది.. ఎంత మందికి అందాల్సి ఉంది.. అనేది లెక్కలతో సహా పెట్టేస్తున్నారు. ఇప్పటికి విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వార 17 వేల 723 కుటుంబాలలో 58 వేల 800 మంది మిడిల్ క్లాస్ వారికి సహాయం అందింది.

కోటి 71 లక్షల 21 వేల ఫండ్ : – 
పాతిక లక్షలతో విజయ్ స్టార్ట్ చేసిన ఈ ఫౌండేషన్ కు ఇప్పటి వరకు 1 కోటి 71 లక్షల 21 వేల ఫండ్ వచ్చింది. 8 వేల 500 లకు పైగా దాతలు ఈ ఫౌండేషన్ కు విరాళాలు అందించారు. దాదాపు 550 మంది వాలంటీర్లు ఫౌండేషన్ కోసం కష్టపడుతున్నారు. ఇంకా అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్థుతం లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఇది త్వరలో క్లోజ్ కాబోతుంది. ఇక ఫౌండేషన్ నిలిపివేస్తున్నట్టు విజయ్ అనౌన్స్ కూడా చేశారు. 

విమర్శలు లెక్క చేయని రౌడీ హీరో : – 
ఒక మంచి పని చేసినప్పుడు మెచ్చుకునేవారు ఉంటారు… వెనక నుంచి విమర్శించేవారు కూడా ఉంటారు. అలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా.. లెక్క చేయకుండా ముందుకు పోతున్నాడు విజయ్. తనను విమర్శించినవారికి లెక్కలతో సమాధానం చెప్పాడు. ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి మెగాస్టార్ వరకు అందరి సపోర్ట్ సాధించాడు. విజయ్ దేవరకొండ. అందరిలా ఏదో మొక్కుబడి సహాయాలు, సలహాలు కాకుండా .. ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ.. ఓ మిషన్ తో, విజయ్ దేవరకొండ ఫౌండేషన్ తో ముందుకెళుతున్నాడు రౌడీ హీరో. జనానికి అసలు ఎలాంటి సహాయం కావాలో అలాంటి హెల్ప్ ని అందిస్తున్నాడు.

Read: గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు, జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి