Vijay Deverakonda : స్పీడ్ పెంచేసిన విజయ్ దేవరకొండ.. రెండు సినిమాల షూటింగ్స్‌తో..!

లైగర్ సినిమాతో కెరీర్ లో గట్టి దెబ్బ ఎదురుకున్న విజయ్.. ఇటీవల కొంచెం స్లో అయ్యాడు. కానీ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచేసి..

Vijay Deverakonda : స్పీడ్ పెంచేసిన విజయ్ దేవరకొండ.. రెండు సినిమాల షూటింగ్స్‌తో..!

Vijay Deverakonda busy with VD12 and VD13 shooting schedules

Updated On : August 1, 2023 / 6:58 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ (Liger) సినిమాతో కెరీర్ లో గట్టి దెబ్బ ఎదురుకున్నాడు. రిలీజ్ కి ముందు ఎంతో హంగామా చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సైలెంట్ అయ్యిపోయింది. దీంతో విజయ్ ప్రస్తుతం అసలు ఎటువంటి హడావుడి లేకుండా తన సినిమా షూటింగ్స్ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ ఖుషి (Kushi) మూవీ చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. అలాగే తన VD12, VD13 షూటింగ్స్ ని కూడా పట్టాలు ఎక్కించి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నాడు.

Pawan Kalyan : ఎన్నికల్లో నెగ్గిన దిల్ రాజుకి జనసేన పవన్ కళ్యాణ్ అభినందనలు..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న VD12 మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ తరువాత లాంచ్ అయినా VD13 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యినట్లు రీసెంట్ గా రిలీజ్ అయిన ఫోటోలు బట్టి తెలుస్తుంది. విజయ్ కి ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తుంది.

Ambati Rambabu : నిర్మాతలూ.. పవన్ కల్యాణ్‌తో జాగ్రత్త, అమ్మవారి శాపం తగిలింది- మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

ఇటీవల లొకేషన్స్ వేటలో ఉన్నామంటూ తెలియజేసిన మూవీ టీం.. షూటింగ్ స్టార్ట్ చేసినట్లు మాత్రం సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా చిత్రీకరణ చేసేసుకుంటున్నారు. నేడు ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు కావడంతో మూవీ సెట్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. మూవీ షూటింగ్ మొదలైనట్లు హింట్ ఇచ్చారు. ఇక విజయ్ స్పీడ్ చూస్తున్న రౌడీ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. లైగర్ తో మిస్ అయిన బ్లాక్ బస్టర్.. వచ్చే సినిమాలతో విజయ్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. మరి ఈ చిత్రాలు ఎంలాటి రిజల్ట్ ని ఇస్తాయో చూడాలి.