Family Star Teaser : ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ వచ్చేసింది.. ఈ గ్యాప్‌లో విజయ్, మృణాల్ ట్విట్టర్‌లో ఫన్నీ చాట్..

పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

Family Star Teaser : ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ వచ్చేసింది.. ఈ గ్యాప్‌లో విజయ్, మృణాల్ ట్విట్టర్‌లో ఫన్నీ చాట్..

Vijay Deverakonda Mrunal Thakur Family Star Movie Teaser released

Updated On : March 4, 2024 / 9:24 PM IST

Family Star Teaser : ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ మరోసారి పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

Also read : Suriya : అభిమానులకు సూర్య ప్రత్యేక విందు.. ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..

గీతగోవిందంలో లవ్ స్టోరీతో ఆకట్టుకున్న విజయ్ అండ్ పరుశురాం.. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకోనున్నారు. ఒక చిన్న టీజర్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కనిపించే చాలా సీన్స్ అలా ఒక ఫ్లాష్ లో చూపించేసారు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు హీరోయిజంని చూపించేలా మాస్ ని కూడా మూవీలో ఉండబోతుందని తెలుస్తుంది.

https://youtu.be/9z83t3gB9vE

ఇది ఇలా ఉంటే, ఈ టీజర్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఆ సమయానికి పోస్టుపోన్ చేస్తూ 8 గంటలకు అంటూ తెలియజేసారు. కానీ ఎనిమిది దాటి తొమ్మిదికి వచ్చాక టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ఆలస్యంతో ఫ్యాన్స్ పాటు హీరోయిన్ మృణాల్ కూడా అలిసిపోయి.. విజయ్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

‘ఏవండీ.. ఇంకెంతసేపండి టీజర్’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ కి విజయ్ రిప్లై ఇస్తూ.. “సారీ తల్లి, ఒచ్చేస్తుంది. ఇంకొన్ని నిమిషాల్లో టీజర్ అప్లోడ్ అయ్యిపోతుంది. ఈసారి నా గారంటీ” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.