Family Star : ఓటీటీకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్.. ఆ తేదీకే..

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీకి వచేస్తుందట. ఎప్పుడంటే..?

Family Star : ఓటీటీకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్.. ఆ తేదీకే..

Vijay Deverakonda Mrunal Thakur family star ott release date update

Updated On : April 14, 2024 / 3:48 PM IST

Family Star : గీతగోవిందం తరువాత దర్శకుడు పరుశురాంతో కలిసి విజయ్ దేవరకొండ చేసిన మరో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూలు అందుకుంది. దీంతో థియేటర్స్ వద్ద ఈ సినిమా పెద్దగా సందడి చేయలేకపోయింది.

అంతేకాకుండా, ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ వ్యాప్తి చెందడంతో కలెక్షన్స్ కి భారీ నష్టం వచ్చి పడింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ విషయంలో ఎదురు దెబ్బ ఎదురుకుంది. అయితే మొదటి వారం పూర్తి అయ్యేపాటికీ కొంచెం పుంజుకున్నా లాభం లేకుండా పోయింది. కొత్త సినిమాల రిలీజ్ లతో ఈ మూవీకి దెబ్బ ఎదురైంది. ఇక థియేటర్ లో పెద్దగా సందడి చేయలేని ఈ సినిమా ఓటీటీకి వచ్చి సందడి చేద్దామని రెడీ అవుతుంది.

Also read : Kalki 2898 AD : కొత్త గవర్నమెంట్ వచ్చాకే.. కల్కి వస్తాడట.. అంటే ఆ సినిమా తేదీకే..

ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం మే 3 నుంచి తెలుగుతో తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ చేయనున్నారట. త్వరలోనే ఈ డేట్ ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుందట. కాగా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి స్పందన లభించింది. దీనిబట్టి చూస్తే.. ఈ మూవీ ఓటీటీలో మంచి స్ట్రీమింగ్ అందుకుంటుందని తెలుస్తుంది. మరి థియేటర్స్ లో సందడి చేయలేని ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో ఏం చేస్తాడో చూడాలి.