విజయ్ దేవరకొండ – ‘వరల్డ్ ఫేమస్ లవర్’

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' (World Famous Lover) అనే టైటిల్ ఫిక్స్ చేశారు..

  • Published By: sekhar ,Published On : September 17, 2019 / 08:02 AM IST
విజయ్ దేవరకొండ – ‘వరల్డ్ ఫేమస్ లవర్’

Updated On : September 17, 2019 / 8:02 AM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) అనే టైటిల్ ఫిక్స్ చేశారు..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ సెప్టెంబర్ 17న ప్రకటించింది మూవీ టీమ్. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో, క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

విజయ్ పక్కన రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్‌ కాగా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా, క్యాథరీన్ మరో ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొద్దిరోజులుగా ‘బ్రేకప్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ టైటిల్ లోగో రిలీజ్ చేశారు.

సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఫస్ట్‌లుక్ రిలీజ్ కానుంది. ఇది విజయ్ నటిస్తున్న 9వ సినిమా, క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 46వ సినిమా కావడం విశేషం. కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపి సుందర్, ఆర్ట్ : సాహి సురేష్.