బన్నీకి విలన్‌గా ‘మక్కల్ సెల్వన్’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 10:46 AM IST
బన్నీకి విలన్‌గా ‘మక్కల్ సెల్వన్’

Updated On : October 29, 2019 / 10:46 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా డిసెంబర్‌లో స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బన్నీ 20వ సినిమా కావడంతో ‘AA20’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ఈ మూవీలో విలన్‌గా పాపులర్ తమిళ్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని తెలుస్తోంది.

చిరంజీవి ‘సైరా’లో రాజాపాండిగా అలరించిన విజయ్.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఉప్పెన’ మూవీలో నటిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Read Also : మా నాన్న నన్ను అమెరికా కోసమే పెంచాడు : ప్రెషర్ కుక్కర్- టీజర్

విజయ్ నటన చూసి, ఆశ్యర్యపోయిన దర్శక, నిర్మాతలు.. అల్లు అర్జున్ సినిమాలో అతణ్ణి విలన్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించనున్నాడు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.