Jana Nayagan: ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ‘జన నాయగన్’.. విజయ్ సినిమాకు లైన్ క్లియర్.. ఫ్యాన్స్ కి సమ్మర్ ట్రీట్
తమిళనాడు ఎలక్షన్స్ తరువాత ఫ్యాన్స్ కి సమ్మర్ ట్రీట్ ఇవ్వనున్న స్టార్ హీరో విజయ్ దళపతి(Jana Nayagan).
vijay thalapathy jana nayagan movie finally releasing on april 24th
- రిలీజ్ కి రెడీ అవుతున్న విజయ్ దళపతి మూవీ
- ఎన్నికలు ముగిసిన వెంటనే థియేటర్స్ లోకి
- ఫ్యాన్స్ కి సమ్మర్ ట్రీట్ ప్లాన్ చేసిన విజయ్
Jana Nayagan: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. దాదాపు మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా విడుదలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో పాటు, ఇది పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
Prabhas: మిర్చి బైక్ తో డార్లింగ్ ప్రభాస్.. ‘బైకర్’ సినిమా కోసం స్పెషల్ వీడియో
నిజానికి, జన నాయగన్(Jana Nayagan) సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, చిత్రంలోని కొన్ని వివాదాస్పద రాజకీయ సంభాషణలు, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అలాగే కోర్టు కేసుల కారణంగా అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు. దీంతో, విజయ్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ అయ్యారు.
అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 24వ తేదీన ‘జన నాయగన్’ను విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక విజయ్ సినిమా విడుదలైన ఆరు రోజుల వ్యవధిలోనే, అంటే ఏప్రిల్ 30న స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనివల్ల ఏప్రిల్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ప్రస్తుతం సెన్సార్ సమస్యలను అధిగమించి ఈ తేదీకే సినిమా వస్తుందని అంతా భావిస్తున్నారు. మరి అన్ని అడ్డంకులను దాటుకుని వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.
