The Greatest Of All Time : ‘ది గోట్’ ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్ ఖాతాలో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మూవీ ది గోట్‌ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).

The Greatest Of All Time : ‘ది గోట్’ ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్ ఖాతాలో మ‌రో బ్లాక్ బాస్ట‌ర్..!

Vijay The GOAT Twitter review Blockbuster say netizens

Updated On : September 5, 2024 / 1:47 PM IST

The GOAT : కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మూవీ ది గోట్‌ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి కథానాయిక. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ నిర్మించింది. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ నేడు (సెప్టెంబ‌ర్ 5) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పూర్తి అయ్యాయి. విజ‌య్ ఇక రాజ‌కీయాల్లో బిజీ కానున్నాడ‌ని, ఇదే అత‌డి చివ‌రి చిత్రం అని ప్రచారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రీ ఈ చిత్రానికి సోష‌ల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో ఓ సారి చూద్దాం.

Double Ismart : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడో తెలుసా..?

ఈ మూవీ అదిరిపోయింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఫ‌స్టాప్ బాగుంద‌ని, సెకండాఫ్ ఇంకా బాగుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోరు ఓ రేంజ్‌లో ఉందంటున్నారు. విజ‌య్ ఖాతాలో మ‌రో భారీ బ్లాక్ బాస్ట‌ర్ ప‌డిన‌ట్లేన‌ని అత‌డి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.