కరోనా బారినపడ్డ ‘కెప్టెన్’ విజయ్ కాంత్

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 03:17 PM IST
కరోనా బారినపడ్డ ‘కెప్టెన్’ విజయ్ కాంత్

Updated On : September 24, 2020 / 4:31 PM IST

Vijayakanth tests Covid positive: ప్రముఖ తమిళనటుడు, డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘కెప్టెన్’ విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ. హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు విజయ్ కాంత్.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘సెప్టెంబర్ 22న విజయ్ కాంత్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయనకు చికిత్సనందిస్తున్నాం. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవుతారు’ అని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పృధ్వీ మోహన్ దాస్ ప్రకటించారు.

కాగా ఆరునెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకునే విజయ్ కాంత్ ఎప్పటిలాగే చెకప్‌కు వెళ్లగా స్వల్పంగా కరోనా లక్షణాలు బయటపడ్డాయని డీఎండీకే పార్టీ వర్గాలు తెలిపాయి.