సినిమాల్లోకి విజయశాంతి రీ-ఎంట్రీ  : రాజకీయాలకు గుడ్‌బై చెబుతుందా?

  • Published By: vamsi ,Published On : April 22, 2019 / 10:28 AM IST
సినిమాల్లోకి విజయశాంతి రీ-ఎంట్రీ  : రాజకీయాలకు గుడ్‌బై చెబుతుందా?

Updated On : April 22, 2019 / 10:28 AM IST

ఒకప్పటి టాప్ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న విజయశాంతి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఎదిగిన విజయశాంతి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి మాత్రం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో వివిధ భాషాల్లో 180 సినిమాలు నటించిన విజయశాంతి మళ్లీ తన సినిమా కెరీర్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. ఈ క్రమంలో  అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఒసేయ్ రాములమ్మ, ప్రతిఘటన, కర్తవ్యం, వైజయంతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన విజయశాంతి ఈ సినిమాలో కూడా ఓ ముఖ్యమైన పాత్ర కాయవడంతో సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే విజయశాంతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రాజకీయాలను వదిలేస్తుందా? లేక రోజా, బాలకృష్ణ మురళీ మోహన్ మాదిరిగా రెండు రంగాల్లోనూ కీలకంగా వ్యవహిరిస్తుందా? అనే విషయంపై క్లారిటీ రాట్లేదు.

విజయశాంతి చివరిసారిగా 2007లో వచ్చిన హిందీ సినిమా జమానత్‌లో నటించింది. ఇన్నేళ్ల లాంగ్ గ్యాప్ తరవాత ఆమె ఎటువంటి పాత్రలో నటిస్తుంది అనేది ఆసక్తికరమే.