SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు.. ఫ్యాన్స్ కి పండగే..
SSMB29 సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా రోజూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

Vijayendra Prasad Comments on Rajamouli Mahesh Babu SSMB 29 Movie
Rajamouli Mahesh Babu : RRR తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు తమ హీరో మొదటి పాన్ ఇండియా సినిమా అని, రాజమౌళి డైరెక్షన్ అని ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. SSMB29 సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా రోజూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
గతంలోనే మహేష్ రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, ప్రపంచదేశాలు చుట్టే సాహస యాత్రలా ఉంటుందని ఓ సందర్భంలో రాజమౌళి చెప్పారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కథ పూర్తయింది అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
Also Read : Lavanya Tripathi : అయోధ్యలో జన్మించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.. మెగా కోడలు లావణ్య ఎమోషనల్ పోస్ట్..
ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, కీరవాణి అదే పనిలో ఉన్నాడని, దానిపై వర్క్ జరుగుతుందని చెప్పాడు. మ్యూజిక్ వర్క్స్ మొదలైంది అంటే సినిమా ఆల్మోస్ట్ మొదలైపోయినట్టే అని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇటీవల జర్మనీకి వెళ్లడంతో ఈ సినిమా వర్క్ కోసమే జర్మనీ వెళ్లాడని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలుపెడతారా అని మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
@urstrulyMahesh@ssrajamouli#SSMB29 Story Ready ?
Music Started?#VijayendraPrasad pic.twitter.com/SxhW1kYQ7K
— Kakinada Talkies (@Kkdtalkies) January 22, 2024