SSMB 29 : మహేష్ రాజమౌళి సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారు.. SSMB29పై విజయేంద్రప్రసాద్ కీలకవ్యాఖ్యలు..
అసలు సినిమా వర్క్ ఏం మొదలుపెట్టకపోయినా జస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనౌన్స్ చేయడంతోనే SSMB29 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
SSMB 29 Movie : రాజమౌళి(Rajamouli) RRR తర్వాత ఎంతో ప్రతిషాత్మకంగా మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేయబోతున్నాడు. RRRతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపుని ఉపయోగించుకొని మహేష్ తో చేసే సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా చేయాలని రాజమౌళి అనుకుంటున్నారు. అసలు సినిమా వర్క్ ఏం మొదలుపెట్టకపోయినా జస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనౌన్స్ చేయడంతోనే SSMB29 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక కొంచెం గ్యాప్ తీసుకొని రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా కథేంటి అని జనాల్లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కథ కూడా ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ రాయనున్నారు. అప్పుడప్పుడు అయన ఏమైనా ఇంటర్వ్యూలు ఇస్తే ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు.
Jailer OTT Release : జైలర్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..! ముహూర్తం ఆరోజు..!
ఇప్పటికే SSMB29 సినిమా ఇండియానా జోన్స్ లాగా ఉంటుందని, అడవుల్లో సాగే అడ్వెంచరస్ సినిమా అని చెప్పారు. ఈ సినిమాని గ్రాండ్ స్కేల్ లో తీసి హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. తాజాగా విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకుంటాం. ఆ ఆలోచన కూడా ఉంది. ఇది ఆఫ్రికాలో సాగే అడ్వెంచర్స్ సినిమా. అంతకంటే ఎక్కువ ఇప్పుడే చెప్పకూడదు అని అన్నారు. దీంతో హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారంటే మనం ఊహించిన దానికంటే సినిమా భారీగానే ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ చాలావరకు ఆఫ్రికాలో జరగనున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమా మొదలవ్వకముందే మహేష్ రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.