Puneeth Rajkumar: పునీత్ మరణించిన ఆఖరి గడియల్లో ఏం జరిగింది? డాక్టర్లు ఏం చెప్పారు?
శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు.

Punith Rajkumar Death
Puneeth Rajkumar: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. విక్రమ్ హాస్పిటల్‌లో పునీత్ రాజ్‌కుమార్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ నాయక్ చనిపోయే ముందు ఏం జరిగింది? అనే విషయాలను తెలియజేశారు.
ఉదయం లేచిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ ఎప్పటిలాగే వర్కవుట్ కోసం జిమ్‌కి వెళ్లాడు. అక్కడ ఆరోగ్యంలో తేడాగా అనిపించింది. వెంటనే పక్కనే ఉన్న ఫ్యామిలీ డాక్టర్ రమణ వద్దకు పునీత్ వెళ్లాడు. అక్కడ ECG చేయగా.. గుండెపోటుగా తేలింది. వెంటనే పునీత్‌ని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండె పనిచేయలేదు.
అప్పుడు మేము దాదాపు 3 గంటల పాటు వెంటిలేటర్‌పై ఉంచి, గుండెకు మసాజ్ చేసి, శాయశక్తులా ప్రయత్నించాము. అయితే, ఆరోగ్యం బాగుపడలేదు. చికిత్సకు పునీత్ శరీరం సహకరించలేదు. గుండెపోటు వచ్చినప్పుడు గుండె చాలా బలహీనంగా ఉంది.
బిగ్ హార్ట్ ఎటాక్ కావడంతో మేము గుండె ఆపరేషన్‌కు సంబంధించిన వైద్య విధానాలను చేయలేకపోయాము. మసాజ్ చేసిన తర్వాత వెంటిలేటర్‌లో ఉంచి, మందులు ద్వారా శరీరంలో కదలికలు మారతాయో? లేదో? చూస్తూ ఉన్నాము. కానీ, స్పందన లేదు.
అయితే, గతంలో ఎప్పుడూ కూడా పునీత్‌కి గుండెకు సంబంధించిన సమస్య రాలేదని చెబుతున్నారు.