Nithin: పాపం నితిన్.. ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది.. విజయ్ కొట్టేశాడట..

టాలీవుడ్ హీరో నితిన్(Nithin) కి గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన 'అఆ' తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు నితిన్ కి.

Nithin: పాపం నితిన్.. ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది.. విజయ్ కొట్టేశాడట..

Vikram K Kumar is working with Vijay Deverakonda, not Nithin.

Updated On : December 29, 2025 / 9:45 AM IST

Nithin: టాలీవుడ్ హీరో నితిన్ కి గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన ‘అఆ’ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు నితిన్ కి. మధ్యలో వచ్చిన భీష్మ కాస్త బెటర అనుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు సైతం డిజాస్టర్ అయ్యాయి. ఈ ఫ్లాప్స్ ఎఫెక్ట్ నితిన్ నెక్స్ట్ సినిమాల పైన చాలా పడింది. ఆ ఎఫెక్ట్ తోనే ఎల్లమ్మ సినిమా నుంచి నితిన్ ని తప్పించారు మేకర్స్. తాజాగా, మరో సినిమా నుంచి కూడా మేకర్స్ నితిన్ ని తప్పించినట్టుగా తెలుస్తోంది.

Ram Gopal Varma: మళ్ళీ గిల్లిన వర్మ.. ప్రభాస్ హీరోయిన్స్ చెంప పగలగొట్టారు.. శివాజీపై కౌంటర్

ఈ సినిమా మరేదో కాదు దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో చేస్తున్న సినిమా. నితిన్(Nithin) గతంలో ఈ దర్శకుడితో ఇష్క్ సినిమా చేసిన విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతోనే నితిన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే, ఆ దర్శకుడితో మరోసారి పని చేసేందుకు సిద్ధం అయ్యాడు నితిన్. విక్రమ్ చెప్పిన కథ కూడా చాలా బాగా సెట్ అయ్యింది అని స్వయంగా నితిన్ చెప్పుకొచ్చాడు. కనీసం, ఈ సినిమాతో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకున్నాడు నితిన్. కాని, ఆ ఆశ కూడా తీరకుండా పోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ ని తొలగించారట మేకర్స్. నితిన్ స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండను తీసుకోనున్నాడట విక్రమ్. ఈ మధ్యే ఈ సినిమా కథను విజయ్ కి వినిపించగా చాలా ఎగ్జైట్ అయ్యాడట. బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట విజయ్ దేవరకొండ ఆ. ప్రస్తుతం విజయ్ దర్శకులు రాహుల్ సాంకృత్యాన్, రవి కిరణ్ కోలా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిన వెంటనే విక్రమ్ కె కుమార్ సినిమాను మొదలుపెట్టనున్నాడట ఈ హీరో. దీంతో, పాపం నితిన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.