Vikram : గాయం నుంచి కోలుకొని వచ్చి.. ఎమోషనల్ ట్వీట్ చేసిన విక్రమ్.. ఎట్టకేలకు ‘తంగలాన్’ షూటింగ్ పూర్తి..

తాజాగా విక్రమ్ తంగలాన్ షూటింగ్ పూర్తయిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు. తంగలాన్ మొదటి రోజు షూటింగ్ ఫొటోని, చివరి రోజు షూటింగ్ ఫొటోని షేర్ చేసి..

Vikram : గాయం నుంచి కోలుకొని వచ్చి.. ఎమోషనల్ ట్వీట్ చేసిన విక్రమ్.. ఎట్టకేలకు ‘తంగలాన్’ షూటింగ్ పూర్తి..

Vikram Thangalaan Movie shoot completed vikram shares emotional tweet

Updated On : July 6, 2023 / 6:43 AM IST

Thangalaan Movie : తమిళ్(Tamil) స్టార్ హీరో విక్రమ్(Vikram) త్వరలో తంగలాన్(Thangalaan) సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇటీవల విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా తంగలాన్ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా అందులో విక్రమ్ కష్టాన్ని, మేకింగ్ విజువల్స్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.

విక్రమ్ ఒక సినిమా కోసం ఎంత దూరం అయినా వెళతారని తెలిసిందే. చాలా సినిమాల్లో వివిధ గెటప్స్ లో చాలా కష్టపడి నటించారు. ఇప్పుడు తంగలాన్ లో కూడా అంతకు మించి నటిస్తున్నారు. అయితే తంగలాన్ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. తంగలాన్ సినిమా షూటింగ్ సమయంలో విక్రమ్ రెండు సార్లు గాయపడ్డారు. ఇటీవల కొన్ని నెలల క్రితమే షూటింగ్ లో గాయపడి పక్కటెముక సర్జరీ చేయించుకున్నారు. దాంతో గత కొన్నాళ్ల నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు విక్రమ్.

తాజాగా విక్రమ్ తంగలాన్ షూటింగ్ పూర్తయిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు. తంగలాన్ మొదటి రోజు షూటింగ్ ఫొటోని, చివరి రోజు షూటింగ్ ఫొటోని షేర్ చేసి.. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. చాలా మంది ట్యాలెంటెడ్ వ్యక్తులతో పనిచేశాను. మొదటి ఫోటోకి, రెండో ఫోటోకి మధ్య 118 రోజులు షూటింగ్ డేస్ ఉన్నాయి. నటుడిగా అద్భుతమైన ప్రయాణం ఇది. డైరెక్టర్ రంజిత్ కి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. దీంతో విక్రమ్ ట్వీట్ వైరల్ గా మారింది.

Salaar Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్.. సలార్ కూడా రెండు పార్టులుగా.. సర్‌ప్రైజ్ అదిరిందిగా..

అయితే విక్రమ్ ఎప్పుడు కోలుకున్నారు, ఎప్పుడు షూటింగ్ కి వచ్చారు ఎలాంటి అప్డేట్ లేకుండానే డైరెక్ట్ గా షూటింగ్ కి వచ్చి పూర్తి చేసేయడంతో అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత త్వరగా కోలుకొని షూటింగ్ కి వచ్చినందుకు విక్రమ్ డెడికేషన్ ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం తంగలాన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలయింది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తారు.