Vikrant Film Creations : సినీ పరిశ్రమలో మరో కొత్త నిర్మాణ సంస్థ.. విక్రాంత్ ఫిలిం క్రియేషన్స్..

టాలీవుడ్ లో మరో కొత్త నిర్మాణ సంస్థ ఆరంభమయింది.

Vikrant Film Creations : సినీ పరిశ్రమలో మరో కొత్త నిర్మాణ సంస్థ.. విక్రాంత్ ఫిలిం క్రియేషన్స్..

Vikrant Film Creations New Production House in Film Industry

Updated On : February 10, 2025 / 12:22 PM IST

తాజాగా టాలీవుడ్ లో మరో కొత్త నిర్మాణ సంస్థ ఆరంభమయింది. ‘విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్’ (VFC) ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పూజా కార్యక్రమం నేడు జరిగింది. VFC ప్రొడక్షన్ హౌస్ ద్వారా శివకృష్ణ మందలపు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

నేడు జరిగిన పూజా కార్యక్రమానికి షైన్ స్క్రీన్స్ అధినేత, నిర్మాత సాహూ గారపాటి, డైరెక్టర్ కార్తీక్ రెడ్డి, నిర్మాత రాందాస్ ముత్యాల, నర్సింహ రెడ్డి, మందలపు ప్రవళిక, స్వప్న చౌదరి అమ్మినేని.. పలువురు ముఖ్య అతిథులుగా ఆహాజరయ్యారు.

BoycottLaila : 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్.. బాయ్ కాట్ లైలా ట్రెండింగ్… రంగంలోకి హీరో

ఈ సందర్భంగా నిర్మాత శివకృష్ణ మందలపు మీడియాతో మాట్లాడుతూ.. మా విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలో ఒక పెద్ద సినిమా మొదలుకాబోతుంది. భవిష్యత్తులో మంచి సినిమాలు నిర్మించాలన్నదే మా లక్ష్యం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం, ప్రోత్సాహంతోనే ఇది మొదలుపెడుతున్నాం అని తెలిపారు. VFC నుండి త్వరలోనే మేజర్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రానుంది.