Virender Sehwag : కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైంది.. ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ సినిమా చూసిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సినిమాపై సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు.

Virender Sehwag : కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైంది.. ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

Virender Sehwag sensational comments on Adipurush Movie

Updated On : June 25, 2023 / 1:28 PM IST

Adipurush :  ప్రభాస్ (Prabhas) రాముడిగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ (Adipurush) సినిమా రిలీజ్ రోజు నుంచే వివాదాలమయంగా మారింది. ముందు నుంచి ఈ సినిమా రామాయణం (Ramayanam) అని చెప్పి, అలాగే ప్రమోట్ చేశారు. ఇక సినిమాలో రామాయణం పాత్రల స్వరూపాలు మార్చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్, గ్రాఫిక్స్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి.

ఓ పక్క సినిమాపై విమర్శలు వస్తున్నా కూడా సినిమా డైరెక్టర్, రైటర్ దానిని సమర్ధించుకుంటూ కొన్ని కామెంట్స్ చేయడంతో ఆదిపురుష్ మరింత వివాదాల్లో నిలిచింది. ఇక వీరిద్దరిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇప్పటికే నేపాల్ లో సినిమాని బ్యాన్ చేయడం, ఇండియాలో సినిమాని బ్యాన్ చేయమని అడగడం కూడా జరిగాయి. ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ సినిమా చూసిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సినిమాపై సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు.

Prabhas : నా డ్రీమ్ నెరవేరబోతోంది.. ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్‌తో నటించడంపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..

ఆదిపురుష్ చూసిన వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ లో.. ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పలువురు వీరేంద్రసేహ్వాగ్ కి సపోర్ట్ గా ఆదిపురుష్ పై మరిన్ని విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తుండగా కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సెహ్వాగ్ ని విమర్శిస్తున్నారు.