Virinchi Varma : లవ్ సినిమాల డైరెక్టర్.. ఇప్పుడు పొలిటికల్ యాక్షన్ డ్రామాతో.. జితేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ విడుదల..

డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో నూతన చిత్రాన్ని తీస్తున్నారు.

Virinchi Varma : లవ్ సినిమాల డైరెక్టర్.. ఇప్పుడు పొలిటికల్ యాక్షన్ డ్రామాతో.. జితేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ విడుదల..

Virinchi Varma jithendar reddy movie Title Poster Released by Director Deva Katta

Virinchi Varma Movie : ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాణంలో ‘జితేందర్ రెడ్డి'( సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు.

1980లో జరిగే ఒక పీరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రియల్ ఇన్సిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే సీరియస్ పొలిటికల్ యాక్షన్ డ్రామా కథగా ఈ చిత్రం ఉండబోతుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Pawan Kalyan Movies : చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన పవన్ సినిమా షూటింగ్?

డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో నూతన చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమా హీరో ఎవరనేది త్వరలో ప్రకటించబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు, ఫస్ట్ లుక్ త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

Virinchi Varma jithendar reddy movie Title Poster Released by Director Deva Katta