Jithender Reddy : క్షమించడం అహింస కాదు అధర్మం.. జితేందర్ రెడ్డి గ్లింప్స్ అదుర్స్..

ఎన్నికల సమయంలో రాబోతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘జితేందర్ రెడ్డి’ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.

Jithender Reddy : క్షమించడం అహింస కాదు అధర్మం.. జితేందర్ రెడ్డి గ్లింప్స్ అదుర్స్..

Virinchi Varma Rakesh Varre Jithender Reddy Glimpse released

Updated On : April 3, 2024 / 9:29 PM IST

Jithender Reddy : ఎన్నికల సమయంలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్న ఈ సినిమాని విరించి వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. 1980 సమయంలో జగిత్యాలలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఈక్రమంలోనే మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. యాక్షన్ డ్రామాతో కట్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఇక గ్లింప్స్ చివరిలో ‘క్షమించడం అహింస కాదు అధర్మం’ అని హీరో చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మరి సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఎన్ని ఉండబోతున్నాయో. ఎందుకంటే పొలిటికల్ డ్రామాలో ఇలాంటి డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కాగా ఈ సినిమాని మే 3న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

Also read : Tillu Square : టిల్లు గాడి కోసం టోనీ.. ఎన్టీఆర్ గెస్ట్‌గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్..

రియా సుమన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రలు చేసారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్‌ సంగీతం అందించారు.