Virupaksha: విరూపాక్ష ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న నిర్వహిస్తున్నారు.

Virupaksha: విరూపాక్ష ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్

Virupaksha Pre-Release Event Date And Venue Fixed

Updated On : April 9, 2023 / 9:16 PM IST

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.

Virupaksha Movie: ట్రైలర్‌ను పట్టుకొస్తున్న విరూపాక్ష.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న కొత్త పోస్టర్!

ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న విరూపాక్ష ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే, ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఎక్కడ నిర్వహిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వేడుకను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న సాయంత్రం 5 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Virupaksha: విరూపాక్ష ముగించేశాడు.. కానీ అది మిగిలే ఉంది!

ఇక ఈ ఈవెంట్‌కు గెస్టులు ఎవరు వస్తారా అనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న విరూపాక్ష మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.