అయోగ్య ఆగిపోయింది : పాట చూసి పండగ చేసుకోండి!

తమిళనాట మే 10న అయోగ్య రిలీజ్ కావాల్సింది కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు..

  • Published By: sekhar ,Published On : May 10, 2019 / 11:25 AM IST
అయోగ్య ఆగిపోయింది : పాట చూసి పండగ చేసుకోండి!

Updated On : May 10, 2019 / 11:25 AM IST

తమిళనాట మే 10న అయోగ్య రిలీజ్ కావాల్సింది కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ టెంపర్, తమిళనాట రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ అభిమానులను సంపాందించుకున్న యంగ్ హీరో విశాల్, తమిళ్ టెంపర్ రీమేక్‌ అయోగ్యలో నటిస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌.. లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై, ఠాగూర్ మధు నిర్మించగా, మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్ట్ చేసాడు. తమిళనాట మే 10న అయోగ్య రిలీజ్ కావాల్సింది కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు.

గతకొద్ది రోజులుగా కోలీవుడ్‌లో విశాల్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితిలో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చెయ్యాల్సి వచ్చింది.. త్వరలో అయోగ్య న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపింది. రీసెంట్‌గా అయోగ్యలోని ‘వేరే లెవల్లే’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు. ఇది తెలుగు టెంపర్‌లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ పాట లాంటిదన్నమాట.. కట్ చేస్తే, సరైనోడు సినిమాలోని ‘బ్లాక్ బస్టరే’ పాటని యథాతధంగా వాడేసారు.. సినిమా రిలీజ్ వాయిదా పడడంతో ఈ పాటతోనే పండగ చేసుకుంటున్నారు తమిళ తంబీలు.

వాచ్ వీడియో సాంగ్..