Vishnu Manchu : కన్నప్ప షూటింగ్‌లో గాయపడిన విష్ణు మంచు..?

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ని న్యూజిలాండ్‌లో మొదలు పెట్టేశాడు. అయితే ఈ మూవీ షూటింగ్‌ను ప్రస్తుతం తాత్కాలికంగా ఆపేశారని టాక్ వినిపిస్తోంది.

Vishnu Manchu : కన్నప్ప షూటింగ్‌లో గాయపడిన విష్ణు మంచు..?

Vishnu Manchu is injured at Kannappa shooting sets news viral

Updated On : October 29, 2023 / 4:18 PM IST

Vishnu Manchu : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ని పట్టాలు ఎక్కించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని అక్కడే జరపనున్నట్లు విష్ణు గతంలోనే తెలియజేశాడు. సింగల్ షెడ్యూల్ లో జరిగే మొత్తం షూటింగ్ కోసం భారీ టీం, సెట్ ప్రోపర్టీతో చిత్ర యూనిట్ అంతా అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తునట్లు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌ను ప్రస్తుతం తాత్కాలికంగా ఆపేశారని టాక్ వినిపిస్తోంది.

డ్రోన్ సాయంతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మంచు విష్ణు చేతికి గాయలయ్యినట్లు సమాచారం. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భయపడాల్సినంత పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని సమాచారం. త్వరలోనే కోలుకొని వచ్చి విష్ణు మళ్ళీ షూటింగ్ సెట్స్ లో పాల్గొంటాడని చెబుతున్నారు.

Also read : Thalaivar170 : ముంబై షెడ్యూల్ పూర్తి.. ఒకే ఫ్రేమ్‌లో రజిని, అమితాబ్.. పోస్ట్ వైరల్..

కాగా ఈ మూవీలో పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. వీరితో పాటు ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, ఆర్టిస్టులు కన్నప్పలో ఉన్నారని మంచు విష్ణు చెబుతున్నాడు. ఇక హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న ‘నుపుర్ సనన్’ తప్పుకోవడంతో.. ఇప్పుడు మరో భామ కోసం వెతుకుతున్నారు. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని.. మోహన్ బాబు దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.