Vishwak Sen : మాస్ కా దాస్ ఫ్యామిలీ ధమాకా అదిరిపోయింది.. ప్రోమో చూశారా..?

ఆహాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫ్యామిలీ ధమాకా మొదలు కాబోతుంది. తాజాగా షో ప్రోమోని రిలీజ్ చేశారు.

Vishwak Sen : మాస్ కా దాస్ ఫ్యామిలీ ధమాకా అదిరిపోయింది.. ప్రోమో చూశారా..?

Vishwak Sen Aha new show Family Dhamaka promo released

Updated On : August 28, 2023 / 9:36 PM IST

Vishwak Sen – Family Dhamaka : ఇన్నాళ్లు యాక్టర్ గా, దర్శకుడిగా ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్.. ఇప్పుడు ‘హోస్ట్’గా సరికొత్త అవతారం ఎత్తి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ఆహాలో (Aha) ‘ఫ్యామిలీ ధమాకా’ అంటూ ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్ షో మొదలుకాబోతుంది. ఈ షోకి విశ్వక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని తెలియజేసిన విశ్వక్.. తాజాగా అదిరిపోయే ప్రోమోతో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు.

Thani Oruvan 2 : ధృవ సీక్వెల్ అనౌన్స్‌మెంట్.. ప్రోమో అదిరిపోయింది.. ఈసారి విలన్..

దాదాపు నాలుగు నిముషాలు పాటు ఉన్న ఈ ప్రోమో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ గా ఉంది. టాలీవుడ్ లోని సెలబ్రిటీస్, అలాగే విశ్వక్ తో నటించిన హీరోయిన్లు కూడా ఈ షోలో సందడి చేయనున్నారు. ఒక సరికొత్త కాన్సెప్ట్ తో విశ్వక్ తనదైన శైలిలో ఆడియన్స్ ని అలరించబోతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ షో.. సెప్టెంబర్ 8 నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. మరి ఫ్యామిలీతో మాస్ కా దాస్ ధమాకా ఎలా ఉండబోతుందో చూడాలి అంటే ఆహాలో చూడాల్సిందే.

Jawan Trailer : జవాన్ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్ చేసిన షారుఖ్ ఖాన్.. ఆ రోజునే పవర్‌ఫుల్ కట్..

ఇక విశ్వక్ సేన్ సినిమాలు విషయానికి వస్తే.. గామి, VS10, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో గామి షూటింగ్ పూర్తి అయ్యి, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. VS10 అప్డేట్ తెలియడం లేదు గాని, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వర్క్స్ మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. కృష్ణచైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుపుతూనే ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే ఇప్పటికే గ్లింప్స్, సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా ఆకట్టుకున్నాయి.