Vishwak Sen: విశ్వక్ సేన్ ధమ్కీ వచ్చేది ఇక అప్పుడేనా..?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో మాస్ కా దాస్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్, ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఈ హీరో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకుని, ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా గతంలో వెల్లడించింది. అయితే ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Vishwak Sen: విశ్వక్ సేన్ ధమ్కీ వచ్చేది ఇక అప్పుడేనా..?

Vishwak Sen Dhamki To Have This Release Date

Updated On : February 20, 2023 / 9:17 PM IST

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరోల్లో మాస్ కా దాస్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్, ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఈ హీరో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకుని, ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా గతంలో వెల్లడించింది. అయితే ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Vishwak Sen: ఓటీటీలో విశ్వక్ సేన్ మూవీ.. ఏమిటో తెలుసా..?

దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తిరిగి ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి నుండి వాయిదా వేసిన చిత్ర యూనిట్, ఇక వేసవి కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Vishwak Sen : బాలకృష్ణ గారు నేను ఫ్రెండ్స్ అయ్యాం..

ఇక ఈ సినిమాలో అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ అఫీషియల్ డేట్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.