Funky Trailer: విశ్వక్ సేన్ ఫంకీ ట్రైలర్ వచ్చేసింది.. అనుదీప్ ఈజ్ బ్యాక్.. పంచులే పంచులు.
విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న ఫంకీ(Funky Trailer) మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది.
vishwak sen funky movie trailer released
Funky Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే శనివారం(ఫిబ్రవరి 7) ఫంకీ మూవీ(Funky Trailer) ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కడుపుబ్బా నవ్వించే కంటెంట్ అనుదీప్ స్టయిల్లో ఒక రేంజ్ లో ఉంది ట్రైలర్. ఇక ఈ ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. ఈసారి విశ్వక్ సేన్, అనుదీప్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి లేట్ ఎందుకు ఫంకీ మూవీ ట్రైలర్ ను ఇక్కడ చూసేయండి.
Ram Pothineni: కలం పడుతున్న రామ్.. స్వయంగా తానే దిగుతున్నాడు. ఈసారి టార్గెట్ మిస్ అవదట!
